News March 7, 2025
మంచిర్యాల: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. మంచిర్యాలలో గాలినాణ్యత విలువ 81గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News December 20, 2025
ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.
News December 20, 2025
కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.
News December 20, 2025
కొండంత లక్ష్యం.. ఎదురొడ్డుతున్న ఇంగ్లండ్

యాషెస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు ఆదిలోనే ఓపెనర్ డకెట్(4) వికెట్ కోల్పోయింది. తర్వాత పోప్(17) కూడా ఔట్ అయ్యారు. దీంతో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో క్రాలే, రూట్ ఉన్నారు. ఆట ఇవాళ, రేపు మిగిలి ఉండగా ENG టార్గెట్ను ఛేదించడం గగనమే.


