News October 25, 2024
మంచిర్యాల: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో అలర్ట్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ 3రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడిచిరోలి SP క్యాంప్ ఆఫీసులో Dy, IGఅంకిత్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రామగుండం CP శ్రీనివాస్ అధ్యక్షత వహించి, రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారు.
Similar News
News November 7, 2024
ADB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
News November 7, 2024
ADB: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు ఉట్నూర్‌లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ సామాన్య శాస్త్రం 3, ఇంగ్లిష్ 3, పీజీటీ భౌతిక శాస్త్రం 1, వృక్ష, భౌతిక, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాల్లో ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో మహిళలతోనే భర్తీ చేస్తామన్నారు.
News November 7, 2024
గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్
గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో గ్రూప్-III పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ III పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.