News April 5, 2025
మంచిర్యాల: ‘మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి’

జిల్లాలో అవసరమున్న చోట మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా BJP నాయకులు రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను కోరారు. శనివారం ఆయన్ను CP కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్ గౌడ్, అశోక్, తదితరులు ఉన్నారు.
Similar News
News February 24, 2026
ములుగు: డీజీపీ ఎదుట లొంగిపోయిన దామోదర్

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయాడు. అతనితో పాటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ‘పోరుకన్నా.. ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చింది.
News February 24, 2026
పార్వతీపురం: ‘మార్ట్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలి’

మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పార్వతీపుం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు.
News February 24, 2026
NGKL: హాల్ టికెట్‌పై సంతకం లేకున్నా పరీక్షకు అనుమతి: DIEO

ప్రైవేట్ కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా విద్యార్థులు ఆందోళన చెందవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) వెంకటరమణ తెలిపారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు మీసేవ ద్వారా హాల్ టికెట్లు పొంది నిశ్చింతగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.


