News February 25, 2025
మంచిర్యాల: మాతాశిశు ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిలవలు, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని సమయానుసారంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News November 16, 2025
ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.
News November 16, 2025
రాజ్యాంగం వల్లే చాయ్వాలా ప్రధాని అయ్యారు: CBN

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.
News November 16, 2025
వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: వెంకట్ నారాయణ

వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా ప్రకటించి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యమకారుల ఐక్యవేదిక ఛైర్మన్ వెంకటనారాయణ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఐటీ హబ్, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామమూర్తి, బాబురావు తదితరులు ఉన్నారు.


