News February 25, 2025
మంచిర్యాల: మాతాశిశు ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, మందుల నిలవలు, రిజిస్టర్లను పరిశీలించారు. గర్భిణీల వివరాలు నమోదు చేసుకుని సమయానుసారంగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News March 23, 2025
చంద్రబాబు పర్యటనపై ఎమ్మెల్యే ఏలూరి వీడియో కాన్ఫరెన్స్

ఏప్రిల్ ఒకటిన సీఎం చంద్రబాబు పర్చూరు నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన ఏర్పాట్లపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులకు పలు సూచనలు చేశారు.
News March 23, 2025
ఎన్టీఆర్: ఆ నిర్ణయంతో వేలాది మందికి చేకూరనున్న లబ్ధి

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్(RTF) కింద రూ.600కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. త్వరలో మరో రూ.400కోట్లు విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన Xలో హెచ్చరించారు.
News March 23, 2025
మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.