News February 11, 2025

మంచిర్యాల: యథాతథంగా భాగ్యనగర్ రైలు

image

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి నేటి నుంచి ఈ నెల 15 వరకు యథాతధంగా నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భాగ్యనగర్ రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News

News March 22, 2025

ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

image

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

News March 22, 2025

నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.

News March 22, 2025

అంతరిక్ష కేంద్రం భూమిపై కూలుతుందా?

image

ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమి నుంచి 415 కి.మీల ఎత్తులో ఉంది. 2031లో ఈ ISS మిషన్ పూర్తవనుంది. దీంతో 109 మీటర్ల పొడవున్న ISS తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి దిశగా రానుంది. ఈక్రమంలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ISS తనంతట తాను ధ్వంసం అయ్యేలా NASA చేయనుంది. మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ (అంతరిక్ష వ్యర్థాల వాటిక)లో పడేలా చేస్తారు.

error: Content is protected !!