News February 11, 2025
మంచిర్యాల: యధాతథంగా భాగ్యనగర్ రైలు

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి యధాతధంగా నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యనగర్ రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైలు యథావిధిగా నడవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 17, 2025
ఖమ్మం: రేపటి నుంచి సదరం క్యాంపులు

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. దివ్యాంగులు ఈ క్యాంపుల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ సదరం క్యాంపులు ఈ నెల 18, 23, 25, 30వ తేదీలలో జరుగుతాయి. అర్హులైన దివ్యాంగులు తమ మెడికల్ రిపోర్టులు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, స్లాట్ బుకింగ్ స్లిప్తో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి హాజరు కావాలని ఆయన కోరారు.
News September 17, 2025
ఆఫ్గనిస్థాన్పై బంగ్లాదేశ్ గెలుపు

ఆసియా కప్: ఆఫ్గనిస్థాన్పై బంగ్లాదేశ్ 8 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 20 ఓవర్లలో 154/5 పరుగులు చేసింది. తన్జిద్ 52, సైఫ్ 30, తౌహిద్ 26 రాణించారు. రషీద్, నూర్ అహ్మద్లకు చెరో 2, అజ్మతుల్లా ఒక వికెట్ తీశారు. ఆఫ్గన్ జట్టు 146 రన్స్కు ఆలౌటైంది. గుర్బాజ్ 35, అజ్మతుల్లా 30, రషిద్ 20 మినహా ఎవరూ మంచిగా రాణించలేదు. ముస్తఫిజుర్ 3, నసుమ్, తస్కిన్, రిషద్లకు తలో వికెట్ దక్కింది.
News September 17, 2025
జైపూర్: విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. జైపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. అధికారులు తదితరులు ఉన్నారు.