News February 11, 2025
మంచిర్యాల: యధాతథంగా భాగ్యనగర్ రైలు

మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11రోజులు రద్దు కావలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233,17234) రైలును నేటి నుంచి యధాతధంగా నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. భాగ్యనగర్ రైలు రద్దు ప్రకటనతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైలు యథావిధిగా నడవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్‌గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్‌లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
News March 19, 2025
సునీత విషయంలో రాజకీయం!

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్‌లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్‌కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News March 19, 2025
పుంగనూరులో 32 మంది కానిస్టేబుళ్ల బదిలీ

పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లను భారీగా బదిలీ చేశారు. ఏకంగా 32 మందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇద్దరినీ వీఆర్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వెంటనే రిలీవ్ చేయాలని.. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.