News February 4, 2025
మంచిర్యాల: యాక్సిడెంట్లో బ్యాంకు ఉద్యోగి మృతి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద <<15356057>>మహిళా ఎస్ఐ శ్వేత కారు..<<>> ఓ బైక్ ను ఢీకొట్టగా ఎస్ఐతో పాటు మరో యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ యువకుడు మంచిర్యాల జిల్లాలోని ఓ బ్యాంకులో పని చేసే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లక్షెట్టిపేట పట్టణంలోని DBS బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న మల్యాల నరేశ్(26) ఉదయం జాబ్కు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మృతిచెందాడని తెలిపారు.
Similar News
News November 25, 2025
జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీ: కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓ, డీపీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 25, 2025
నిర్మల్: నిరుద్యోగులకు ఉచిత సోలార్ శిక్షణ

సూర్యమిత్ర కోర్సులో భాగంగా నిర్మల్లోని రాజీవ్ గాంధీ ఐటీఐలో ఉచిత సోలార్ శిక్షణ అందించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ అమిత్ దేశ్ పాండే తెలిపారు. 90 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐటీఐ లేదా డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులన్నారు.