News April 7, 2025
మంచిర్యాల: యాక్సిడెంట్లో విద్యార్థి మృతి

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News December 8, 2025
T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్స్టార్!

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.
News December 8, 2025
అంజూ బాబీ జార్జ్.. ఎందరికో ఆదర్శం

మన దేశానికి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తొలి పతకం తెచ్చిన క్రీడాకారిణి అంజూ బాబీ జార్జ్. కేరళకు చెందిన అంజూ ఒక జన్యుపరమైన సమస్యతో ఒకే కిడ్నీతో జన్మించినా.. దాన్ని అధిగమించి ఎన్నో పతకాలు, అవార్డులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలతో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గెలుచుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News December 8, 2025
KNR: ‘పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు ఎన్.వెంకటేశ్వర్లు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, ఏర్పాట్లు, భద్రత, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించారు. లోపాలున్న చోట వెంటనే సరిదిద్దాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


