News November 9, 2024

మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.

Similar News

News December 14, 2024

బెల్లంపల్లి: ఊయల మెడకు చుట్టుకొని మహిళ మృతి

image

కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.

News December 14, 2024

నిర్మల్ : బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క

image

స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

News December 13, 2024

ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతాం :సీతక్క

image

ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీయూకేటీ బాసరను మంత్రి సందర్శించారు. క్యాంపస్‌కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైస్ ఛాన్స్‌లర్, విద్యార్థులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.