News February 12, 2026
మంచిర్యాల: లెక్కింపునకు ‘మూడంచెల’ కవచం

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా సాగేలా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు CP అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు క్యాతనపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో ఫలితాల వెల్లడి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా పెట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 16, 2026
ADB: భట్టి పద్దు.. జిల్లా ప్రాజెక్టులకు నిధులు దక్కేనా..?

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ADB జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. ప్రాణహిత-చేవెళ్ల పనులకు భట్టి పద్దులో ప్రాధాన్యం దక్కుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కొమురం భీమ్ ప్రాజెక్టు, పెద్దవాగు పూర్తికి నిధులు అవసరమున్నాయి. చనాక-కోరాట, పింపల్‌కాడ్, కుఫ్టీ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తేనే సాగునీటి కల సాకారమవుతుంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వారు కోరుతున్నారు.
News March 16, 2026
హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.


