News February 6, 2025

మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి

image

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News December 7, 2025

భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

image

<>RITES <<>>17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60,000-రూ.2,55,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయసు 62ఏళ్లు. డిసెంబర్ 10, 11 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.rites.com

News December 7, 2025

జనగామ: గుర్తులు ఖరారు!

image

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

News December 7, 2025

కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

image

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.