News April 9, 2025
మంచిర్యాల: సింగరేణి ఉద్యోగులకు GOOD NEWS

మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారం దీర్ఘకాలిక వ్యాధుల్లో లివర్ సిర్రోసిస్ వ్యాధిని కూడా ఆమోదించినట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. స్టాండర్డైజేషన్ కమిటీలో బీఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి, నాయకులు సుదీర్ఘంగా చర్చించి కోల్ ఇండియా యాజమాన్యాన్ని ఒప్పించారన్నారు. దీంతో లివర్ సిరోసిస్ వ్యాధిని లిస్టులో చేర్చేందుకు ఆమోదించారని తెలిపారు.
Similar News
News November 26, 2025
NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.
News November 26, 2025
మంగపేటలో 15 ఏళ్లుగా ఎన్నికలు లేవు!

ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి 15 ఏళ్లుగా ఓటు వేసే హక్కు లేకుండా పోయింది. 2011 నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన ద్వారానే గ్రామాల నిర్వహణ కొనసాగుతోంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ వివాదం కోర్టులో ఉండగా మండలంలోని 23 గ్రామాల్లో సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. దీంతో ఈసారి కూడా ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది.
News November 26, 2025
ASF: సర్పంచ్ పోటీకి యువత గురి

అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం. సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చూపిస్తామంటూ ఆసిఫాబాద్ జిల్లా యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్గా తీసుకునే రాజకీయ నేతలకు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో చాలామంది యూత్ సర్పంచ్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాంకిడి సర్పంచ్ స్థానానికి పోటీ చేసే ఆశావహుల పేర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.


