News December 27, 2024

మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!

image

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.

Similar News

News January 4, 2026

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

image

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.

News January 3, 2026

నార్నూర్ అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేయాలి: కలెక్టర్

image

నీతి ఆయోగ్ డేటా ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 4వ స్థానం, దక్షిణ భారతదేశంలో 1వ స్థానం సాధించిన నార్నూర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.5 కోట్ల రివార్డ్ గ్రాంట్‌ను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. నిధుల వినియోగంపై శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్నూర్ సాధించిన ఈ విజయం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు.

News January 2, 2026

జైనథ్: కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలి: మాజీ మంత్రి

image

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.