News February 3, 2025
మంచిర్యాల: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 సెంటర్లు ఏర్పాటు చేయగా ప్రాక్టికల్ రాసే జనరల్ విద్యార్థులు 3,850 మంది, ఒకేషనల్ రాసే విద్యార్థులు 1936 మంది విద్యార్థులు ఉన్నారు. హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News November 6, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్ @2PM

*రేపు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 12కు వాయిదా
*హైదరాబాద్ బోరబండలో బండి సంజయ్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేశారంటూ బీజేపీ నేతల ఆందోళన.. సభ జరిపి తీరుతామని స్పష్టం
*జూబ్లీహిల్స్‌లో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉందన్న కిషన్ రెడ్డి
*ఫిరాయింపు MLAలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లను నేడు విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
News November 6, 2025
5 గంటలకు చెరువుకు గండి: తిరుపతి SP

<<18214583>>చెరువుకు గండి<<>> పడిన వెంటనే పోలీసులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేయడంతో ప్రాణ నష్టం జరగలేదని తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. రాయలచెరువు ముంపు ప్రాంతాల్లో SP గురువారం పర్యటించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. ‘ఉదయం 5 గంటల సమయంలో గండి పడింది. దాదాపు 500 ఇళ్లు నీటమునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యలతో ప్రజలను సురక్షితంగా తరలించాం. పశువుల నష్టం జరిగిన చోట తక్షణ చర్యలు చేపట్టాం’ అని SP చెప్పారు.
News November 6, 2025
సమగ్ర వ్యవసాయ విధానాలు (మోడల్స్)

☛ పంటలు + పశువులు +జీవాల పెంపకం.
☛ పంటలు + పశువులు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపల పెంపకం
☛ పంటలు + పశువులు + కోళ్లు + చేపల పెంపకం.
☛ పంటలు + కోళ్లు + చేపలు + పుట్టగొడుగుల పెంపకం
☛ పంటలు + పశువులు + వర్మీ కంపోస్ట్ + చేపల పెంపకం
☛ పశువులు+ జీవాలు + కోళ్ల పెంపకం.. వాతావరణం, రైతు స్థితి, సహజ వనరులను బట్టి <<18185953>>సమగ్ర వ్యవసాయ<<>> అనుబంధ రంగాలను ఎంచుకోవచ్చు.


