News March 31, 2025

మంచిర్యాల: సుమంత్‌ గౌడ్‌కి గ్రూప్‌-1లో STATE RANK

image

గ్రూప్‌-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన సుమంత్ గౌడ్. కాగా, ఈయన గ్రూప్-2, 3, 4లో కూడా ర్యాంకు సాధించాడు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో రాష్ట్రస్థాయిలో 286వ ర్యాంకు, మల్టీజోన్‌లో 126వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సుమంత్ గౌడ్ GHMCలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Similar News

News October 26, 2025

VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్‌ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.

News October 26, 2025

మొంథా తుఫాను పయనమిలా..

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 26, 2025

ప.గో.: కలెక్టర్, జేసీతో సమావేశమైన ప్రసన్న వెంకటేశ్

image

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి. ప్రసన్న వెంకటేశ్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌తో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, ముందస్తుగా తీసుకున్న చర్యలపై సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.