News January 26, 2025
మంచిర్యాల: హెల్మెట్ భారం కాదు భద్రత: CP

బైక్ నడిపే వారికి హెల్మెట్ భారం కాదు భద్రత అని CP శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా హెల్మెట్తో ప్రాణానికి భద్రత అని అవగాహన కల్పించారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలకు, సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ సిబ్బందికి 150 హెల్మెట్లను పంపిణీ చేశారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్ (వెనక కూర్చునే వ్యక్తి) కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
Similar News
News November 23, 2025
తిరుపతి: అమ్మవారి పంచమీ తీర్థానికి పటిష్ఠ ఏర్పాట్లు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టింది. పంచమీ తీర్థం అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
News November 23, 2025
పల్నాడు ఉత్సవాల్లో అపశ్రుతి

పల్నాడు ఉత్సవాల్లో ఆదివారం ముగింపు వేళ విషాదం చోటుచేసుకుంది. నాగులేరులో స్నానాలు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ ఆకస్మికంగా తెగి పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
రూ.485కే 72 రోజుల ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్లో ఉన్నాయి.


