News January 26, 2025

మంచిర్యాల: హెల్మెట్ భారం కాదు భద్రత: CP

image

బైక్ నడిపే వారికి హెల్మెట్ భారం కాదు భద్రత అని CP శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాల సందర్భంగా హెల్మెట్‌తో ప్రాణానికి భద్రత అని అవగాహన కల్పించారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలకు, సీనియర్ సిటిజన్స్, మున్సిపల్ సిబ్బందికి 150 హెల్మెట్లను పంపిణీ చేశారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్ (వెనక కూర్చునే వ్యక్తి) కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

Similar News

News February 8, 2025

విజయవాడ: సీఎం చంద్రబాబును కలిసిన శాప్ ఛైర్మన్ 

image

శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాభివృద్ధి అంశాలపై చర్చించి, పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాల విడుదలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో క్రీడలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించి, ప్రణాళిక సిద్ధం చేస్తే త్వరలోనే కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. 

News February 8, 2025

సిద్దిపేట: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావాహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

News February 8, 2025

సంగారెడ్డి: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావాహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

error: Content is protected !!