News February 19, 2025
మంచిర్యాల: 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,189 మంది రెగ్యులర్, 221 మంది విద్యార్థులు సప్లీలు రాయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
Similar News
News December 5, 2025
ములుగు: ఆ ఒక్కరోజు తేడా వస్తే అంతే సంగతి!

పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఓటింగ్ ముందు రోజు అత్యంత కీలకం కానుంది. ప్రజలకు ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత సింపతీ కూడగట్టుకున్నా ఆ ఒక్కరోజు ఓటర్లను వశం చేసుకోవడం పెద్ద టాస్క్. పంపకాల్లో తేడా వస్తే చేసిన ప్రచారం, అభివృద్ధి, హామీలు నీరుగారిపోయినట్లేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ములుగు(D)లో ఈసారి ప్రధాన, ప్రతిపక్ష అభ్యర్థులే అనేకచోట్ల బరిలో ఉండటంతో అంచనాలు పెరిగాయి.
News December 5, 2025
విజయోత్సవ ర్యాలీలు, డీజేలు నిషేధం: సూర్యాపేట ఎస్పీ

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల పరిధి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు. ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. బాణాసంచా పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమన్నారు.
News December 5, 2025
KMR: పనులు చేయకపోతే రాజీనామా.. సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్

సర్పంచ్ ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ కొనసాగుతోంది. మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాకు చెందిన శివాని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే తనను గెలిపిస్తే కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలు నెరవేర్చకపోతే తన పదవీకి రాజీనామ చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటనన్నారు.


