News February 24, 2025

మంచిర్యాల: CM రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

image

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలు దేరి 11.50 నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి కరీంనగర్ బయలుదేరుతారు.

Similar News

News January 6, 2026

అతిగా దుస్తులు కొంటున్నారా?

image

‘ఫాస్ట్ ఫ్యాషన్’ పేరుతో మనం కొంటున్న దుస్తులు పర్యావరణానికి శాపంగా మారుతున్నాయి. ఏటా వెలువడుతున్న క్లాతింగ్ వేస్ట్ సముద్రాలను, నేలను విషతుల్యం చేస్తున్నాయి. మనం ధరించే ఒక్క జత బట్టల తయారీకి ఎన్నో లీటర్ల నీరు ఖర్చవుతుంది. అందుకే అవసరముంటేనే దుస్తులు కొనండి. ఉన్నవాటిని ఎక్కువ కాలం వాడండి. ఫ్యాషన్ కోసం ప్రకృతిని కలుషితం చేయకండి. బాధ్యతగా బట్టలు కొందాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం. SHARE IT

News January 6, 2026

చివరి టెస్టు.. పట్టు బిగించిన ఆసీస్

image

యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 384 పరుగులకు ఆలౌటవగా, ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 518/7 స్కోర్ చేసింది. దీంతో 134 పరుగుల లీడ్ సాధించింది. హెడ్ 163, స్టీవ్ స్మిత్ 129* అద్భుత సెంచరీలు చేశారు. కార్సే 3, స్టోక్స్ 2, జోష్, జాకోబ్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే 3-1 తేడాతో ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

News January 6, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,160
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,027
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.