News March 12, 2025
మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సైతం కేసు నమోదైంది.
Similar News
News December 10, 2025
అనకాపల్లి: పిల్లలను దత్తత తీసుకునేవారు నిబంధనలు పాటించాలి

పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు నిబంధనలు పాటించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం అనకాపల్లి మండలం తుంపాలలో మాట్లాడుతూ ముందుగా మిషన్ వాత్సల్య వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దత్తతకు సంబంధించి ఫ్యామిలీ ఫోటో నివాస ఆదాయ వివాహ తదితర ధ్రువపత్రాలను సమర్పించాలన్నారు. దత్తత తీసుకునే సమయంలో రూ.50 వేలు డీడీ రూపంలో చెల్లించాలన్నారు.
News December 10, 2025
అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.


