News March 12, 2025
మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది.
Similar News
News March 13, 2025
నాని సవాల్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
News March 13, 2025
మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.
News March 13, 2025
సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.