News March 14, 2025
మంచిర్యాల: PHOTO OF THE DAY

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా చిన్నారులు రంగులు పూసుకొని సందడి చేసిన ఫొటో ఆకట్టుకుంటుంది. జిల్లాలోని యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. పలు గ్రామాల్లో చేసిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. మీ ప్రాంతంలో హోలీ ఎలా జరిగిందో కామెంట్ చేయండి.
Similar News
News March 15, 2025
శంషాబాద్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన RGIA పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. MBNRకు చెందిన బాలిక అదే ప్రాంతానికి చెందిన యువతితో కలిసి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. వికారాబాద్కు చెందిన జోసఫ్ రాళ్లగూడలో నివాసముంటూ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
News March 15, 2025
అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్(83), సింగపూర్(19) దేశాలకు చెందినవి ఉన్నాయి. మెుత్తంగా 393 విదేశీ ఉపగ్రహాలు, 3కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61దేశాలు, 5బహుళజాతి సంస్థలతో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది.
News March 15, 2025
ట్రాక్టర్ బోల్తా పడి కాకినాడ జిల్లా వాసి మృతి

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.