News December 22, 2024

మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

image

పవన్ కళ్యాణ్ ట్రస్ట్ ద్వారా అనంతగిరి మండలం కొర్రపత్తి ఎం.పి.పి. స్కూల్‌ను అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. బల్లగరువులో సభను ముగించుకుని వెళ్తున్న పవన్ కళ్యాణ్ దారిలో ఉన్న కొర్రపత్తి స్కూల్‌కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడగా వారు సమస్యను వివరించారు. అలాగే అంగన్వాడీ సెంటర్, స్కూల్ ప్రహరీ గోడ, ఊరిలో సీసీ రోడ్లు పంచాయతీరాజ్ శాఖ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు.

Similar News

News January 13, 2025

విశాఖ: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం

News January 12, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో రేపు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగీ పండుగ నేపథ్యంలో సెలవు దినం కావడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. విశాఖ నగర ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News January 12, 2025

వైజాగ్‌లో ఒప్పో రెనో 13 సిరీస్ లాంఛ్

image

ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్‌ను విశాఖ డాబా గార్డెన్స్ సెల్ పాయింట్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సినీనటి డింపుల్ హయాతి మార్కెట్లోకి విడుదల చేశారు. చైర్మన్ మోహన్ ప్రసాద్ పాండే మాట్లాడుతూ.. సంక్రాతి సందర్బంగా ప్రత్యేక రాయితీలు, లక్కీ డ్రా అందుబాటులో ఉందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ పాయింట్ డైరెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.