News September 20, 2024

మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: ఎండీ

image

విశాఖ జిల్లాలో మంజూరైన ప్రతి ఇంటిని అధికారులు దగ్గరుండి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు కాంట్రాక్టర్లకు అధికారులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసి మయూర్ అశోక్ పాల్గొన్నారు.

Similar News

News November 17, 2025

ఆన్‌లైన్ మోసాలపై పోలీసుల సూచనలివే..

image

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు సూచించారు. తెలియని కాల్స్, ఇమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు సిబ్బంది ఎప్పుడూ OTP, PIN, CVV అడగరని తెలిపారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దన్నారు. TeamViewer, AnyDesk వంటి రిమోట్ యాప్‌లు ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. ఒక్క నిర్లక్ష్యంతో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

image

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.