News April 9, 2025
మండపేటలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మండపేట మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి కే కృష్ణవేణి మాట్లాడుతూ.. ఆఫ్కాస్ రద్దు చేసిన ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేసి పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. మండపేట విస్తరణకు తగ్గట్లు కార్మికులను రిక్రూట్ చేయాలన్నారు.
Similar News
News December 4, 2025
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

భారత్పై రెండో వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా ఛేజింగ్లో రికార్డ్ సృష్టించింది. భారత్పై అత్యధిక స్కోర్ ఛేదించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2019 మొహాలీలో భారత్ 359 రన్స్ చేయగా ఆసీస్ ఛేజ్ చేసింది. నిన్న రాయ్పూర్లోనూ సౌతాఫ్రికా ఇదే స్కోరును ఛేదించింది. అలాగే మూడుసార్లు(2సార్లు AUS, IND) 350, అంతకంటే ఎక్కువ పరుగులను ఛేజ్ చేసిన జట్టుగా భారత్ సరసన నిలిచింది.
News December 4, 2025
చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి?

అర్ఘ్యం ఇవ్వడానికి ముందుగా రాగి పాత్ర తీసుకోవాలి. అందులో శుభ్రమైన నీరు, కొద్దిగా పాలు పోయాలి. అక్షతలు, పూలు వేయాలి. దాన్ని 2 చేతులతో పట్టుకుని, చంద్రుడిని చూస్తూ నిలబడాలి. చంద్రుడి మంత్రాలు చదువుతూ.. ఆ నీటిని కిందకు ప్రవహించేలా నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడం చంద్రుడి అనుగ్రహంతో ఆరోగ్యం, అదృష్టం మెరుగుపడతాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనస్సు స్థిరంగా ఉంటుందని నమ్మకం.
News December 4, 2025
నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. కాగా జిల్లాకు ఎయిర్పోర్టుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.


