News February 25, 2025

మండపేటలో స్కూల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

image

తండ్రి మందలించాడని విద్యార్థిని స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మహమ్మద్ పజియా(14) ఖాళీ సమయంలో స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. పాల్పడింది. గాయాలైన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Similar News

News December 13, 2025

విశాఖ: ‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

image

విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ అంటే CMకి ప్రత్యేక అభిమానం అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక YCP నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు.

News December 13, 2025

KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

శంకరపట్నం మండలంలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) గౌస్‌ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్‌ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

News December 13, 2025

‘ఓట్ చోరీ’పై రేపు కాంగ్రెస్ సభ

image

‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు హాజరుకానున్నారు. ఓట్ చోరీపై ఇప్పటిదాకా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సభ తర్వాత సంతకాలతో కూడిన మెమొరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు.