News October 20, 2024

మండపేట: ఒక్కటైన దివ్యాంగుల ప్రేమజంట

image

రెండేళ్ల క్రితం అమలాపురంకి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లిన ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు. ఈ సమస్యను ఎమ్మార్పీఎస్ నాయకులు పరిష్కరించారు. కె.గంగవరం మండలం పాణింగపల్లికి చెందిన లంక గంగమ్మ (31) ఎస్సీ, కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వేములపూడి ప్రసాద్ (32) లకు శనివారం మండపేటలో వివాహం జరిపించారు.

Similar News

News November 22, 2025

“తూర్పు”లో టెన్త్ రాయనున్న 26,619 విద్యార్థులు

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 26,619 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి విజయం సాధించాలని డీఈఓ సూచించారు.

News November 22, 2025

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు: శశాకం

image

సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.