News March 12, 2025

మండపేట: బతుకు దెరువు కోసం వెళ్లి మృత్యువాత

image

బతుకు దెరువు కోసం మండపేట కొండపల్లి వారి వీధికి చెందిన జితేంద్ర(33) నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు జితేంద్రకు భార్య, 4నెలల కుమార్తె, తల్లి, సోదరుడు ఉన్నారు. జితేంద్ర కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. అయితే జితేంద్ర మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతదేహాం నిన్న రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. 

Similar News

News November 25, 2025

నవంబర్ నారీమణులదే

image

ఈ నెలలో భారత నారీమణులు ప్రపంచ వేదికలపై అదరగొట్టారు. ఈ నెల 2న భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలవగా, 23న అంధుల మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. నిన్న ఉమెన్ ఇన్ బ్లూ కబడ్డీ వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు. ఈ విజయాలు క్రీడల్లో మహిళలను ప్రోత్సహించేందుకు మరింత ఉపయోగపడుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ నెలలో మహిళలు డామినేట్ చేశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.

News November 25, 2025

WGL: లిక్కర్ షాపులకు మరో రెండు రోజులే..!

image

ఉమ్మడి జిల్లాలో 294 లిక్కర్ షాపుల లైసెన్స్ గడువు మరో రెండు రోజులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి పాత మద్యం షాపులకు సరఫరా నిలిపివేసి, 28 నుంచి కొత్త మద్యం షాపులకు లిక్కర్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డిపోల కేటాయింపు, షాపులకు పేర్లపై డిపో కోడ్‌లను జనరేట్ చేసి QR కోడ్‌లు సిద్ధమవుతున్నాయి. DEC 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. కొత్త షాపులకు సర్పంచ్ ఎన్నికలు కలిసి రానున్నాయి.

News November 25, 2025

జనగామ: ముక్కిపోతున్న దొడ్డు బియ్యం!

image

జిల్లాలోని ఆయా రేషన్ డీలర్ల షాపులలో పాత స్టాక్ (దొడ్డు బియ్యం) ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మిగిలిపోయిన పాత స్టాక్ మొత్తం పురుగులు పట్టి పాడవుతున్నాయని, ఇప్పటికే 70% మేర బియ్యం పాడైపోయాయని ఆయా షాపుల రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.