News March 12, 2025
మండపేట: బతుకు దెరువు కోసం వెళ్లి మృత్యువాత

బతుకు దెరువు కోసం మండపేట కొండపల్లి వారి వీధికి చెందిన జితేంద్ర(33) నాలుగు రోజుల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు జితేంద్రకు భార్య, 4నెలల కుమార్తె, తల్లి, సోదరుడు ఉన్నారు. జితేంద్ర కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. అయితే జితేంద్ర మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతదేహాం నిన్న రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు.
Similar News
News February 11, 2026
గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.
News February 11, 2026
పాలమూరు: ఓటేసేందుకు వెళ్తున్నారా..?

మున్సిపల్ ఎన్నికలకు ఓటేసేందుకు వెళ్తున్నారా? ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించుకోండి. ప్రలోభాల ఎర చూపిన వారికి వేస్తారో లేక పనులు చేయించగలిగే నాయకుడిని ఎన్నుకుంటారో ఇక మీ చేతుల్లోనే ఉంది. ఒక్క ఓటు ఐదేళ్ల భవిష్యత్‌కు పునాదిలాంటింది. అలాంటి ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
News February 11, 2026
రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.


