News February 1, 2025
మండపేట: భక్తి ముసుగులో రూ.40 కోట్లకు టోకరా

భక్తి ముసుగులో మహిళా భక్తులకు అధిక వడ్డీలు ఎర చూపి రూ.40 కోట్ల మేర ఓ వ్యక్తి మోసం చేసిన ఘటన మండపేటలో వెలుగులోకి వచ్చింది. మండపేటకు చెందిన ఓ వ్యక్తి పరిసర ప్రాంతాల్లో దేవుడు ముసుగులో కీర్తనలు, భజనలు నిర్వహిస్తున్నాడు. అధిక వడ్డీలు ఇస్తుండడంతో మహిళా భక్తులు అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొన్నాళ్లు సక్రమంగా ఇస్తూ అతడు ఆకస్మికంగా బోర్డు తిప్పేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Similar News
News July 11, 2025
HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.
News July 11, 2025
‘కొండ’ను ఢీకొనడం కష్టమే..!

నలుగురు ఎమ్మెల్యేలు జట్టుకట్టినా కొండా దంపతులను ఢీకొనడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నలుగురు ఎమ్మెల్యేలు ఏకమై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏకరువు పెట్టినా ఏం చేయలేకతున్నారనే టాక్ ఓరుగల్లులో ఉంది. ఉమ్మడి వరంగల్‌లో 7 స్థానాలను తామే గెలిపించామని, వాళ్లకు అంత సీన్ లేదంటూ కొండా దంపతులు కార్యకర్తలతో బాహాటంగానే చెప్తుండడం చూస్తుంటే నిజమేనని తెలుస్తుంది.
News July 11, 2025
కోనసీమ: ధాన్యం బకాయిలు రూ.188.87 కోట్లు విడుదల

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన రబీ ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. 9,505 మంది రైతులకు రూ.188.87 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 32,996 మంది వద్ద 2,69,986 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రూ. 620.98 కోట్లు విలువైన ధాన్యం కొన్నారు.