News March 22, 2025
మండపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మాచవరం- రామచంద్రపురం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్పై వెళ్తుండగా సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 24, 2025
పీజీఆర్ఎస్ అర్జీలకు ప్రాధాన్యం: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 42 మంది ఫిర్యాదుదారుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి, వాటిని సకాలంలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


