News March 22, 2025
మండపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మాచవరం- రామచంద్రపురం రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 23, 2025
ఫెయిలై ఒకరు.. తక్కువ మార్కులొచ్చాయని మరొకరు సూసైడ్

AP: ఇద్దరు టెన్త్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కృష్ణా(D) అర్జువానిగూడెంకు చెందిన G.అనిల్ గతేడాది, ప్రస్తుతం సైన్స్ పరీక్షలో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని చనిపోయాడు. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన G.వేణుగోపాలరావుకు ఇవాళ టెన్త్ ఫలితాల్లో 393 మార్కులొచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని ఉరేసుకొని మృతిచెందగా, స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
పిడుగురాళ్ల: ప్రభుత్వ ఉద్యోగికి సివిల్స్‌లో 830వ ర్యాంక్

పిడుగురాళ్లలో వాణిజ్య శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్గవ ఆల్ ఇండియా స్థాయిలో 830వ ర్యాంకు సాధించారు. 2025లో ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. తాజాగా వచ్చిన ఫలితాల్లో సత్తా చాటారు. విజయనగరం జిల్లాలోని రాజం గ్రామానికి చెందిన విష్ణు, ఈశ్వరమ్మ దంపతులకు కుమారుడైన భార్గవ బీటెక్ పూర్తి చేశారు.
News April 23, 2025
గ్రేటర్ HYDలో 5 టెస్టింగ్ కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్

గ్రేటర్ HYDలో ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి కలిపి నాచారంలో ఏకైక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది. దీంతో పాటు మరో 5 నూతన ఫుడ్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. ఆహార తనిఖీలు పెంచడం, ఆహార నాణ్యతను పాటించడం ఇక మరింత సులభంగం మారనుంది. ZC స్థాయిలో స్థలాల స్వీకరణ తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు.