News March 15, 2025
మండపేట: రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని మింగేసింది

TPG హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం మృతి చెందింది. మండపేటకు చెందిన బోగిళ్ల సురేన్(39) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య నవ్య36), కుమార్తె వాసవీ కృష్ణ(4), వారి బంధువు శ్రీరమ్యతో కలిసి కారులో మండపేట బయలుదేరారు. కుంచనపల్లి వచ్చేసరికి కారు హైవేపై పనులు చేస్తున్న లారీని ఢీకొట్టింది. ముగ్గురు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI రమేష్ తెలిపారు.
Similar News
News April 18, 2025
మస్క్‌తో చర్చలు.. మోదీ ట్వీట్

ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌తో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరువురి మధ్య జరిగిన విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News April 18, 2025
సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వీరుడు కర్రోల్ల నర్సయ్య

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య వర్థంతి నేడు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1957 నుండి1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో జన్మించారు. 2003లో ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించారు. నర్సయ్య భార్య దుర్గమ్మ గతంలో చనిపోయిందని, ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇటీవలే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
News April 18, 2025
జాట్ మూవీ టీంపై కేసు నమోదు

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.