News February 11, 2025
మండపేట: సెంట్రింగ్ కర్ర తగిలి వ్యక్తి మృతి.. UPDATE

మండపేటకు చెందిన కొమ్మిశెట్టి సత్తిబాబు సోమవారం అనపర్తిలో సెంట్రింగ్ కర్ర తగిలి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తన సోదరుడు వెంకటేశ్ గత ఏడాది 11న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నెలల వ్యవధిలో కుమారులిద్దరూ కన్నుమూయడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
Similar News
News March 17, 2025
సిద్దిపేట: రాజకీయ నాయకులతో కలెక్టర్ సమావేశం

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్ధుల్ అమీద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరీ సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు.
News March 17, 2025
కృష్ణా: జిల్లాలో పదో తరగతి పరీక్షకు 286 మంది గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు కృష్ణాజిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఈఓ రామారావు తెలిపారు. తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 21,162 మంది విద్యార్థులకు 20,876 మంది హాజరయ్యారన్నారు. 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 4, DLO అధికారులు 2, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ 2 కేంద్రాలను పరిశీలించారన్నారు.
News March 17, 2025
సిరిసిల్ల: మహిళలను అభినందించిన కలెక్టర్

ఈనెల 20వ తేదీ నుంచి ఢిల్లీలో జరుగుతున్న కే లో ఇండియా పారా గేమ్స్‌కు ఎంపికైన మిట్టపల్లి అర్చన, భూక్య సక్కుబాయిలను కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఇటువంటి మైలురాయిలు మరెన్నో చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.