News January 26, 2025

మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలి: ASF కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 పథకాల అమలు కోసం ప్రభుత్వ ఆదేశాలనుసారం జిల్లాలలోని అన్ని మండాలాల్లో ఒక్కొ గ్రామాన్ని  ఎంపిక చేయాలని అధికారులకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు.  ఎంపిక చేసిన గ్రామాల్లో 100% అర్హులైన వారికి పథకాలు అందజేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదన్నారు.

Similar News

News December 10, 2025

కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కడప SP

image

ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్‌కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News December 10, 2025

భవానీ దీక్ష పరులు ఇరుముడి సమర్పించేది ఎక్కడంటే.!

image

భవానీ భక్తుల సౌకర్యార్థం 3 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. కొండ కింద నూతన ప్రసాదాల తయారీ భవనం ఎదురుగా 2, గోశాల పక్కన ఒకటి ఏర్పాటు చేసిన వాటిని 11న ప్రారంభిస్తారు. భక్తులు ఇరుముడి సమర్పించేందుకు 110స్టాండ్లతో కూడిన పాయింట్లను నూతన అన్నదాన భవన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 300మంది గురు భవానీలు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. కొండ దిగువన, పైభాగంలో తాత్కాలిక క్యూమార్గాల్లో వాటర్‌ ప్రూఫ్‌ షామియానా ఏర్పాటు చేశారు.

News December 10, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ ఎస్పీ

image

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.