News February 28, 2025
మండవల్లిలో ట్రైన్ కిందపడి యువకుడు మృతి

మండవల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఓ యువకుడు గురువారం రాత్రి ట్రైన్ కింద పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరి రాము, వీరకుమారి పెద్ద కుమారుడు ఆంజనేయులు (19) ఐటీఐ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కొండ్రాయి చెరువు ఎదురుగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో గూడ్స్ ట్రైన్ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 24, 2025
బాపట్ల: ’25 రోజులు పొడిగించాలి’

బీసీ కార్పొరేషన్ లోన్‌ల విధానాలలో కొన్ని సవరణలు చేయాలని బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు కోరారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్ మురళిని కలిసి వినతి పత్రం అందజేశారు. బీసీ కార్పొరేషన్ లోన్‌లకు గడువు కనీసం 25 రోజులు పొడిగించాలన్నారు. సచివాలయ సిబ్బందితో బీసీ కార్పొరేషన్ లోన్లు గురించి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
News March 24, 2025
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. గద్వాల సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సంతోష్ స్వీకరించారు.
News March 24, 2025
VJA: క్షయ నివారణపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో క్షయ వ్యాధి నివారణ అవగాహన పై రూపొందించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందించి జిల్లాను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.