News November 23, 2024

మండవల్లి:  తల్లి-కుమారుడు దారుణ హత్య

image

మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ (60), సురేశ్ (21)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఇంటిలో వీరు హత్యకు గురి కావడం గ్రామంలో సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 7, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అంతరాయం.. గాల్లోనే విమానాలు

image

గన్నవరం విమానాశ్రయంలో శనివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగుకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, హైదరాబాదు నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టగా.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకుపైగా గాల్లో ఉండి, తిరిగి హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.

News December 7, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 

News December 7, 2024

కృష్ణా: 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌‌సైట్‌లో CAREERS ట్యాబ్ చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.