News January 28, 2025

మండవల్లి: బాలుడుతో సహా నలుగురు మృతి

image

మండవల్లి మండలం భైరవపట్నంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ఆదివారమే ప్రాణాలు విడవగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈనెల 24న రాత్రి భైరవపట్నంలో గ్యాస్ సిలిండర్లు పేలి తొమ్మిది గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. తమిళనాడులోని వేలూరు‌లో చికిత్స పొందుతూ డబ్బా పాప(అను)(20), దుబ్బా విక్కి(3), నక్కల కార్తీక్ (19), నక్కల చరణ్ (17)‌లు మంగళవారం మృతి చెందారు. 

Similar News

News November 19, 2025

కలెక్టర్ హెచ్చరిక

image

ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారికి రసీదు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తహశీల్దార్లతో పలు రెవెన్యూ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పీజీఆర్ఎస్ అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.

మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..?

image

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.