News January 28, 2025
మండవల్లి: బాలుడుతో సహా నలుగురు మృతి

మండవల్లి మండలం భైరవపట్నంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూడేళ్ల బాలుడు ఆదివారమే ప్రాణాలు విడవగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈనెల 24న రాత్రి భైరవపట్నంలో గ్యాస్ సిలిండర్లు పేలి తొమ్మిది గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. తమిళనాడులోని వేలూరులో చికిత్స పొందుతూ డబ్బా పాప(అను)(20), దుబ్బా విక్కి(3), నక్కల కార్తీక్ (19), నక్కల చరణ్ (17)లు మంగళవారం మృతి చెందారు.
Similar News
News February 13, 2025
కామారెడ్డి: హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయిన విద్యార్థి

సిరిసిల్ల గంభీరావుపేట మండలం గోరింటాకు చెందిన శివరామకృష్ణ అనే బాలుుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం అతని తల్లి హాస్టల్‌లో వదిలేందుకు తీసుకు వెళ్తుండగా రైల్వే గేటు వరకు వచ్చి పారిపోయినట్లు ఆమె తెలిపింది. మిస్సింగ్ కేసును నమోదు చేసినట్లు కామారెడ్డి పోలీసులు పేర్కొన్నారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక పారిపోయాడని బాలుని తల్లి చెప్పారు.
News February 13, 2025
వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News February 13, 2025
కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.