News August 27, 2024

మండుతున్న ఎండలు.. దేశంలో నెల్లూరు టాప్

image

నెల్లూరు జిల్లాలో ఆశించిన మేర వర్షాలు పడటం లేదు. మరోవైపు ఎండలు మండుతున్నాయి. వేసవిని తలపించేలా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జిల్లా వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నిన్నటి రోజున దేశంలోనే అత్యధికంగా నెల్లూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనే ఉన్న తిరుపతి జిల్లాలో 38.8 డిగ్రీల ఎండ కాసింది. వర్షాలు లేకపోవడం, పొడి వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.

Similar News

News February 26, 2026

నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

image

ఆన్‌లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News February 26, 2026

నెల్లూరు: ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

image

ఈ నెల పింఛన్లను ఒక్క రోజు ముందుగానే ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మార్చి నెల ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛన్ నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 289647 పింఛన్లకు సంబంధించి రూ.126.91 కోట్లను అందజేస్తున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.

News February 26, 2026

NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

image

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.