News May 5, 2024
మండుతున్న భానుడు.. వర్ని @46.4℃

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వర్ని మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలుగా నమోదైంది. 27 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News October 19, 2025
NZB: 23 వరకు వైన్స్లకు దరఖాస్తుల స్వీకారం: ES

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
News October 19, 2025
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

దీపావళి పండుగను పురస్కరించుకుని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని అభిలషించారు.
News October 19, 2025
రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఆర్మూరు FBO సుశీల్

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలో ఆర్మూరు రేంజ్ FBO బాస సుశీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రాష్ట్ర సాయి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాసర జోన్ లెవెల్లో నిర్వహించిన మెన్స్ రైఫిల్ షూటింగ్లో మొదటి విజేతగా సుశీల్ నిలిచారు. అలాగే హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.