News May 5, 2024

మండుతున్న భానుడు.. వీణవంక @46.5℃

image

కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వీణవంక మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలుగా నమోదైంది. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News November 5, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.2,27,188 ఆదాయం

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,27,188 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,776, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.45,690, అన్నదానం రూ.23,732,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News November 5, 2024

కరీంనగర్ జిల్లాలోని 108 అంబులెన్స్‌లో ఉద్యోగ అవకాశాలు

image

KNR జిల్లాలోని వివిధ మండలాల108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ ఇమ్రాన్ తెలిపారు. అర్హత: BSC-BZC, BSC-NURS, ANM, GNM, B-PM, M-PM లేదా ఇంటర్ తర్వాత ఏదైనా మెడికల్ డిప్లమా ఉండాలని, 25-30లోపు వయసు ఉండాలన్నారు. ఈనెల 6న ఉదయం 10 నుంచి 4లోపు, జిల్లా ఆస్పత్రిలోని 108 ఆఫీసులో ఒరిజినల్, ఒక సెట్టు జిరాక్స్‌తో రావాలన్నారు.

News November 5, 2024

రుద్రంగిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

image

వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండలంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయనకు బీజేపీ శ్రేణులు పుష్పగుచ్చాలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.