News February 4, 2025

మంత్రాలయంలో యువకుడి ఆత్మహత్య

image

మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో వసంత్ (32)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శివాంజల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. వసంత్ గత ఆరు నెలలుగా పైల్స్, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నొప్పిని తాళలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హేమవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 13, 2025

కర్నూలు జిల్లాకు ‘దామోదరం’ పేరు పెట్టాలి: వీహెచ్

image

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.

News February 13, 2025

‘భీముని కొలను’ గురించి తెలుసా?

image

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.

News February 13, 2025

కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి

image

కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

error: Content is protected !!