News May 4, 2024

మంత్రాలయం ఎన్నికల బరిలో ముగ్గురు రాఘవేంద్రరెడ్డి, ఇద్దరు నాగిరెడ్డిలు

image

మంత్రాలయం నియోజకవర్గంలో బరిలో 8మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారిలో టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్రరెడ్డి పేరును పోలిన మరో ఇద్దరు, వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి పేరున పోలిన పేరుతో ఒకరు ఎన్నికల బరిలో ఉన్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి ఆర్. రాఘవేంద్రరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎం. రాఘవేంద్రరెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కె.నాగిరెడ్డి పోటీలో ఉన్నారు.

Similar News

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

News October 1, 2024

కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు

image

కర్నూలులోని వన్‌టౌన్‌ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్‌ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్‌, జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.

News October 1, 2024

నేడు పత్తికొండకు CM చంద్రబాబు

image

కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.