News August 17, 2024
మంత్రాలయం: నదిలో దూకిన మహిళ

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఆదోని మండలం అలసంద గుత్తి గ్రామానికి చెందిన తిక్క లక్ష్మి అనే మహిళ దూకింది. గమనించిన కానిస్టేబుల్ రంగస్వామి ఆమెను కాపాడి మెరుగైన వైద్యం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆమెను కాపాడటంతో నది దగ్గర ఉన్న భక్తులు అభినందించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు వచ్చాయని వాటిని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని సంబంధిత పోలీసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
News December 8, 2025
కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.
News December 8, 2025
నకిలీ కాల్స్‌కి మోసపోవద్దు: ఎస్పీ

ఇటీవలి రోజుల్లో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి ఓటీపీ, కార్డ్ నంబర్, సీవీవీ, ఇతర వివరాలు అడిగి భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ ఓటీపీ, పాస్‌వర్డ్, సీవీవీ ఫోన్‌లో అడగవు. లిమిట్ పెంపు/కార్డ్ అప్‌గ్రేడ్ అంటూ వస్తున్న అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దు. తెలియని లింకులు, యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు అన్నారు.


