News April 13, 2025
మంత్రికి ధన్యవాదాలు తెలిపిన బ్యాట్మెంటన్ క్రీడాకారులు

కాటారంలో బ్యాట్మెంటన్ క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్టు కొరకు రూ. కోటి మంజూరు చేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కాటారం బ్యాట్మెంటన్ క్రీడాకారులు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఆదివారం ఉదయం జరగబోయే ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి క్రీడాకారులు పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బ్యాట్మెంటన్ క్రీడాకారులు కోరారు.
Similar News
News November 10, 2025
రబీ.. చౌడు నేలలకు అనుకూలమైన వరి రకాలు

☛ M.T.U 1293: సన్నగింజ రకం. పంట కాలం 120 రోజులు. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. చౌడు నేలలకు అత్యంత అనుకూలం. దిగుబడి సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు భూమిలో 2.0-2.5 టన్నులు
☛ జగిత్యాల రైస్-1(JGL-24423): పంటకాలం 120-125 రోజులు. దొడ్డుగింజ రకం. దిగుబడి ఎకరాకు 30-35 క్వింటాళ్లు. ఆరుతడి, నేరుగా విత్తే పద్ధతులకు అనుకూలం. సుడిదోమను, చలి ఉద్ధృతిని, చౌడును కొంతమేర తట్టుకుంటుంది.
News November 10, 2025
శివాలయంలో ఇలా చేస్తున్నారా?

శివాలయంలో తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
1. నందీశ్వరుడికి, శివునికి మధ్య నడవకూడదు. ఎందుకంటే నంది చూపు శివుడిపై స్థిరంగా ఉండాలి.
2. శివలింగానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు.
3. శివాలయంలో ప్రదక్షిణ నియమాలు వేరుగా ఉంటాయి. గుడి చుట్టూ తిరిగకూడదు. సోమసూత్రాన్ని దాటకుండా.. అక్కడి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి.
News November 10, 2025
జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.


