News November 13, 2024

మంత్రికి వెంకటగిరి ఎమ్మెల్యే వినతి

image

వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. విజయవాడలో మంత్రి నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిశారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఉద్యోగ సిబ్బంది కొరత ఉందని.. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Similar News

News November 15, 2024

నెల్లూరు: ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ చర్చ

image

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News November 15, 2024

వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు

image

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.

News November 14, 2024

నెల్లూరు: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు

image

అల్పపీడన‌ ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సెల్ ఫోన్లకు హెచ్చరికలు చేసింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలి.అని మెసేజ్ పంపంది. మీకు ఈ మెసేజ్ వచ్చిందా?.