News June 12, 2024

మంత్రిగా గొట్టిపాటి ప్రమాణ స్వీకారం

image

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ గొట్టిపాటి రవి కుమార్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

Similar News

News March 18, 2025

ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

image

ప్రకాశం జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. కందులకు 45 కొనుగోలు కేంద్రాలు, శనగలకు 36 కొనుగోలు కేంద్రాలు, మినుములకు 10 కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రాప్‌లో కంది, శనగ, మినుములు నమోదైన రైతులు 2 రోజులలో సీఎం యాప్‌లో తమ పేర్లను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.

News March 18, 2025

22న పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన?

image

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈనెల 22న ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం రావడం జరుగుతుందని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

News March 18, 2025

ప్రకాశం: ఉచిత ఇంటర్ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రకాశం జిల్లాలోని 6 మోడల్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరంకు ఉచిత విద్యకై ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో, విద్యార్థుల ప్రవేశం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. మే 22వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో పేర్కొన్నారు.

error: Content is protected !!